NRPT: ఇవాళ ఎస్పీ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా వివిధ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ బాధితుల నుంచి స్వీకరించారు. ఫిర్యాదులను చట్ట ప్రకారం పరిశీలించ వలసిందిగా CI, SI లకు సూచించారు. ఫిర్యాదుదారులకు న్యాయం చేసేలా పని చేయాలని ఎస్పీ పోలీసు అధికారులకు సూచించారు.