KMM: అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే పనుల్లో భాగంగా అండర్ పాస్ నిర్మాణం ఎత్తు పెంచే వరకు పనులు నిలుపుదల చేయాలని మధిర మండలం నిధానపురం గ్రామ ప్రజలు నిరసన చేపట్టారు. సోమవారం నిదానపురం వద్ద జరుగుతున్న పనులను అడ్డుకొన్నారు. 20 అడుగుల ఎత్తు వరకు పెంచాలని కోరారు. ఎత్తు పెంచే వరకు అండర్ పాస్ నిర్మాణ పనులు నిలుపుదల చేయాలన్నారు.