మేడ్చల్: ఉప్పల్, కుత్బుల్లాపూర్, మేడ్చల్, మల్కాజ్గిరి ప్రాంతాలలో పలువురు విద్యుత్ వినియోగదారులు వారి సమస్యలను సోమవారం HIT TVకి తెలిపారు. కరెంట్ బిల్లు ప్రతి 30 రోజులకు జనరేట్ చేయకుండా ఒక్కోసారి తేదీ గడిచి ఆలస్యం అవుతుందని, దీంతో యావరేజ్ యూనిట్ల బిల్లు రావటంతో 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకం అమలు కావడం లేదని వాపోయారు. దీని ద్వారా నష్టపోతున్నట్లు వివరించారు.