Top 5 laptops: రూ.30 వేలలోపు టాప్ 5 ల్యాప్‌టాప్‌లు
మీరు తక్కువ బడ్జెట్లో మంచి ల్యాప్ టాప్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. మీ వ్యక్తిగత లేదా వ్యాపార అవసరాల కోసం ఆన్లైన్లో కొనుగోలు చేసేందుకు టాప్ 5 ఎంపికలను ఇక్కడ అందిస్తున్నాము. ఫీచర్లు, స్క్రీన్ పరిమాణం, ప్రాసెసర్, మరిన్నింటి ఆధారంగా రూ.30,000 కంటే తక్కువ ల్యాప్‌టాప్ ల కోసం ఆన్లైన్లో షాపింగ్ చేసే వారికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది.
ప్రస్తుత తరుణంలో సరైన బడ్జెట్ ల్యాప్‌టాప్‌ను కనుగొనడం చాలా కష్టమైన పని అని చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపు అనేక కంపెనీలు ల్యాప్ టాప్ రేట్లను భారీగా పెంచేశారు. ఈ క్రమంలో మీరు మంచి ల్యాప్‌టాప్ తోపాటు అన్ని ప్రాథమిక అవసరాలను తీర్చుకోవడానికి ఇక్కడ టాప్ 10 ఎంపికలను అందజేస్తున్నాము. అంతేకాదు ఇవి రూ.30,000 లోపు ఉండటం విశేషం. ఈ క్రమంలో ల్యాప్ టాప్ ప్రాధాన్యతలు, ఫీచర్లు వంటి జాబితా ఇక్కడ ఇస్తున్నాము. అందులో మీకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకుని కొనుగోలు చేయండి.
1. AVITA ఎసెన్షియల్ 14 అంగుళాల బిజినెస్ ల్యాప్‌టాప్
విండోస్ 10 హోమ్‌తో కూడిన ఎసెన్షియల్ ల్యాప్ టాప్ అల్ట్రా-ఫాస్ట్ SSD డ్రైవ్ సౌకర్యంతో అందుబాటులో ఉంది. మీ అన్ని పనులను వేగంగా, మరింత సమర్థవంతంగా తక్కువ విద్యుత్ వినియోగంతో పూర్తి చేయడానికి అనుమతిస్తుంది. దీంతోపాటు ఏకకాలంలో ఛార్జ్ చేయడానికి, డేటాను బదిలీ చేయడానికి వివిధ పరికరాలకు కనెక్ట్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది. సెలెరాన్ ఎన్ 4000 ప్రొసెసర్, అల్ట్రా ఫాస్ట్ SSD, 4GB RAM, 128GB SSD వంటి ప్రధాన ఫీచర్లు ఉన్నాయి. దీని రేటు ప్రస్తుతం అమెజాన్‌లో రూ.27,900గా ఉంది.
2. Lenovo IdeaPad Slim 3
బడ్జెట్లో పోర్టబుల్ ల్యాప్‌టాప్ కోసం వెతుకుతున్న వారికి ఇది మంచి ఎంపిక. ఇది కేవలం 1.85 కిలోల బరువుతో లభించే అల్ట్రా స్లీక్ ల్యాప్‌టాప్, 15.6 అంగుళాల HD యాంటిగ్లేర్ డిస్ప్లే. Intel Celeron N4020 ప్రాసెసర్‌తో 4GB RAM, 256GB SSD స్టోరేజ్ సపోర్టుతో అందుబాటులో ఉంది. ప్రస్తుతం దీని ధర రూ.32,150గా ఉంది.
ASUS VivoBook 15 Intel Dual core ల్యాప్ టాప్ Celeron N4020 ప్రాసెసర్‌తో లభిస్తోంది. దీంతోపాటు 4GB RAM, 512 GB స్టోరేజ్, Windows 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది. హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, ట్యూనింగ్, SonicMaster మీకు ఉత్తమమైన నోట్‌బుక్ PC ఆడియోను అందించాలనే లక్ష్యంతో అభివృద్ధి చేయబడింది. ప్రస్తుతం దీని ధర రూ.24,990గా ఉంది.
4. Acer Aspire 3 AMD Athlon Silver
ఆఫీసుకు వెళ్లేవారికి, విద్యార్థులకు ఇది గొప్ప ఎంపిక. ల్యాప్‌టాప్ Windows 10 హోమ్‌తో పాటు 2.3 GHz AMD అథ్లాన్ సిల్వర్ 3050U డ్యూయల్ కోర్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ల్యాప్‌టాప్ AMD RadeonTM గ్రాఫిక్స్ కార్డ్‌తో నిండి ఉంది. 256 GB Hard Disk Size, 4GB DDR4 RAMని కలిగి ఉంది. ప్రస్తుతం దీని ధర రూ.30,980గా ఉంది.
5. HP Chromebook 14a తేలికపాటి టచ్‌స్క్రీన్ ల్యాప్‌టాప్
థిన్ & లైట్ టచ్‌స్క్రీన్ ల్యాప్‌టాప్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్లతో ఆకట్టుకునే 14-అంగుళాల డిస్ప్లేతో ఇది అందుబాటులో ఉంది. ఈ ల్యాప్‌టాప్‌లో వాయిస్ తో కూడిన Google అసిస్టెంట్ ఫీచర్ కూడా ఉంది. ఇది స్వయంచాలక సాఫ్ట్వేర్ అప్డేట్లతో Chrome OS ద్వారా అందించబడుతుంది కాబట్టి మీరు ఎల్లప్పుడూ తాజా వైరస్ రక్షణను కలిగి ఉంటారు. ఈ పరికరం 4GB DDR4-2400 SD RAM, 64 GB eMMC హార్డ్ డ్రైవ్‌ను 256 GB వరకు సౌలభ్యం కలదు. దీని ధర ప్రస్తుతం అమెజాన్‌లో రూ.16,791గా ఉంది.