WGL: రాయపర్తి మండల కేంద్రంలో మహిళలకు రూ. 4 కోట్లు 96 లక్షల బ్యాంక్ లింకేజ్ రుణాలు సోమవారం చెక్కులను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళల ఆర్థిక సుస్థిరతకు ప్రభుత్వం పలు పథకాలను అందజేస్తుందన్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు రుణాలను సద్వినియోగం చేసుకుని తమ వ్యాపారాలు, ఉపాధి అవకాశాలను పెంచుకోవాలని తెలిపారు.