HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో సోమాజిగూడ మాజీ కార్పొరేటర్ మహేష్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటినుంచే ప్రచారం జోరుగా సాగించాలని నిర్ణయించారు. ప్రజావ్యతిరేక ప్రభుత్వ విధానాలపై ప్రతి కార్యకర్త ప్రజలకు ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.