ATP: బుక్కరాయసముద్రం ఎంపీపీ సునీతపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి వైసీపీ MPTCలు సిద్ధమవుతున్నట్లు మండలంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈనెల 26కు పదవి చేపట్టి నాలుగేళ్లు పూర్తవుతుంది. పార్టీ పెద్దలు అనుమతిస్తే అవిశ్వాస తీర్మానంలో టీడీపీ ఎంపీపీని పదవి నుంచి దింపటానికి 13 మంది వైసీపీ ఎంపీటీసీలు సిద్ధమైనట్లు సమాచారం వినిపిస్తుంది.