JGL: జగిత్యాల పట్టణంలో ఆదివారం వృద్ధులు, వితంతులు, బీడీ కార్మికులతో MRPS నాయకులు సమావేశం నిర్వహిచారు. ఈ సందర్భంగా MRPS జిల్లా అధ్యక్షుడు దుమాల గంగారం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్లు పెంచుతానని హామీ ఇచ్చి ఇంతవరకు పెంచలేదన్నారు. సోమవారం జరిగే మండల కార్యాలయాల ముట్టడిని విజయవంతం చేయాలని గంగారం పిలుపునిచ్చారు.