VZM: కొత్తవలస పోలీసు స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలు జరుగుతుండడంతో ప్రజలు కంటి మీద కునుకు లేకుండా భయం గుప్పిట్లో ఉంటున్నారు. రాత్రి నిఘా పటిష్టంగా లేకపోవడంతో దొంగలు శివారు ప్రాంతాలు ఎంచుకొని, అర్ధరాత్రి దొంగతనానికి పాల్పడుతున్నారు. ఆగస్టు నెల 9న బాలాజీనగర్, 28న ఆర్టీసీ కాంప్లెక్స్ , చింతలపాలెంలో శనివారం జరిగిన దొంగతనం కూడా అర్ధరాత్రి జరగడం గమనార్హం.