JDWL: మల్దకల్ మండలం శేషంపల్లి గ్రామానికి చెందిన శేషంపల్లి నర్సింహులు తెలంగాణ మున్నూరు కాపు రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నియమితులయ్యారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మూసాయిపేటలో ఆదివారం జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ నియామకం జరిగింది. తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు పుట్ట పురుషోత్తం పటేల్ రావు సమక్షంలో నియామక పత్రాన్ని ఆయన అందుకున్నారు.