ATP: వైసీపీ నేత తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. ఆదివారం ఉ.8 గంటలకు అనంతపురం రామచంద్రనగర్ నివాసం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర 11 గంటలకు తోపుదుర్తి గ్రామానికి చేరుకుంది. గ్రామాల ప్రజలు ఘనంగా నివాళులు అర్పించారు. కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. మధ్యాహ్నం 1.45కి వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు ముగిశాయి.