WGL: వేలేరు మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య దిష్టిబొమ్మను కాంగ్రెస్ నేతలు ఆదివారం దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. తాటికొండ రాజయ్య నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు. కడియం శ్రీహరి గురించి మాట్లాడే అర్హత రాజయ్యకు లేదని విమర్శించారు. మరోసారి కడియం గురించి మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.