లేటెస్ట్ అప్టేట్ ప్రకారం.. టాలీవుడ్లో ఓ క్రేజీ కాంబినేషన్ దాదాపుగా ఫిక్స్ అయినట్టేనని తెలుస్తోంది. అది కూడా ఎవరు ఊహించని కాంబో కావడంతో ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే ఆ కాంబినేషన్ కొత్తదే కాదు. ఒకప్పుడు శేఖర్ కమ్ముల సినిమాలో ఆర్టిస్ట్‌గా చేసిన విజయ్ దేవరకొండ.. ఇప్పుడు హీరోగా చేయబోతుండడమే దాని స్పెషాల్టీ. లైగర్ ఫ్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటనేది ఇంకా క్లారిటీ రావడం లేదు. ప్రస్తుతం రౌడీ చేతిలో శివ నిర్వాణ ‘ఖుషీ’ చిత్రం మాత్రమే ఉంది. దీని తర్వాత గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అనౌన్స్మెంట్ కూడా రానుందని వినిపిస్తోంది. అయితే ఇప్పుడు శేఖర్ కమ్ములకు విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.
గతంలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ మూవీలో విజయ్ దేవరకొండ చిన్న పాత్రలో కనిపించాడు. అప్పటి నుంచి శేఖర్ కమ్ములతో సినిమా చేయాలని అనుకుంటున్నాడు విజయ్. అయితే ఇన్నాళ్లకు ఈ ఇద్దరికి సరిపోయే కథ దొరికిందని అంటున్నారు. ఇటీవలే ఈ ఇద్దరి మధ్య స్టోరీ డిస్కషన్స్ కూడా జరిగాయని తెలుస్తోంది. అన్ని కుదిరితే త్వరలో ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ ఉండొచ్చని అంటున్నారు. అయితే లవ్ స్టోరీ సినిమా తర్వాత.. కోలీవుడ్ హీరో ధనుష్‌తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు శేఖర్ కమ్ముల. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండతో ప్రాజెక్ట్ అంటున్నారు. కాబట్టి ఈ కాంబినేషన్ పై కాస్త క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ నిజంగానే ఈ కాంబో సెట్ అయితే మాత్రం.. ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.