NTR: విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేట డయేరియా వైద్య శిబిరం వద్ద భారీ స్థాయిలో వైద్యులను ప్రభుత్వం ఆదివారం ఏర్పాటు చేసింది. 18 మంది వైద్యులు, ముగ్గురు ప్రత్యేక వైద్యులు, ముగ్గురు రాపిడ్ టెస్టింగ్ వైద్యులు, 36 మంది నర్సులు, 60 మంది ఆశా కార్య కర్తలను శిబిరం వద్ద విధుల నిమిత్తం కేటాయించింది. వీరిలో వైద్యులు, నర్సులు, ఆశా కార్యకర్తలు 20 బృందాలుగా ఉన్నారు.