WGL: వరంగల్ నగరాభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని నగర మేయర్ గుండు సుధారాణి తెలిపారు. శనివారం కేరళ ప్రభుత్వం నిర్వహించిన కేరళ అర్బన్ కాంక్లేవ్-2025 సదస్సులో పాల్గొన్న ఆమె, గ్రేటర్ వరంగల్లో వేగవంతమైన పట్టణీకరణ, స్థిరమైన అభివృద్ధి, సామాజిక ప్రగతి కోసం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.