HYD: వినాయక విగ్రహాల నిమజ్జనం తర్వాత హుస్సేన్ సాగర్తో పాటు చుట్టూ ఉన్న రోడ్లు, ఫుట్ పాత్ల నుంచి GHMC, HMDA సిబ్బంది 1000 టన్నుల నిమజ్జన వ్యర్ధాలు, చెత్తాచెదారం తొలగించారు. హుస్సేన్ సాగర్ చుట్టూ 500 మంది పారిశుద్ధ్య కార్మికులు చెత్త తొలగింపులో పాల్గొన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నిమజ్జన వ్యర్థాలు 150 టన్నుల మేర అదనంగా తొలగించినట్లు అధికారులు తెలిపారు.