మణిపూర్ చురాచాంద్పూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు PM మోదీ శంకుస్థాపనలు చేశారు. అనంతరం బాధిత కుటుంబాలను పరామర్శించారు. ‘మణిపూర్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఎన్నో ప్రాజెక్టులు చేపట్టాం. ఐటీ స్పెషన్ ఎకనామిక్ జోన్ ఏర్పాటు చేస్తున్నాం. కోల్కతా, ఢిల్లీల్లో మణిపూర్ భవనాల నిర్మాణం జరిగింది. GSTని తగ్గించాం. దీంతో హోటల్ ధరలు తగ్గి టూరిజం పెరుగుతుంది’ అని అన్నారు.