CTR: పూతలపట్టు మండలం రంగంపేట ఫ్లై ఓవర్ వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు దాతుతున్న బైకును చిత్తూరు నుంచి వస్తున్న కారు అతి వేగంగా ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో చిత్తూరుకు చెందిన నేత్రన్, హరి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.