NLG: జిల్లాలో యూరియాను అక్రమంగా నిల్వచేసిన, అధిక ధరలకు విక్రయించిన దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శరత్ చంద్ర పవార్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఐదు కేసులు నమోదయ్యాయి. కొన్ని ఫర్టిలైజర్ షాప్ల లైసెన్సులు రద్దు చేసేందుకు కలెక్టర్కు నివేదిక పంపినట్టు తెలిపారు. యూరియా స్టాక్, ధర వివరాలను షాపు ముందు ప్రకటించాలంటూ దుకాణదారులకు ఆదేశాలు జారీ చేశారు.