SKLM: వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రానున్న మూడు రోజులపాటు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణం శాఖ అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలలో తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్ష సూచన ఉందన్నారు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసినట్లు, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.