BHPL: మహాదేవపూర్ మండల కేంద్రంలో MRPS మండల అధ్యక్షుడు సురేష్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మడిపల్లి శ్యాంబాబు మాదిగ, అంబాల చంద్రమౌళి హాజరై, మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను దాటివేస్తోందని విమర్శించారు. వృద్ధులు, వితంతువులకు పెన్షన్ ₹4000కి, వికలాంగులకు ₹6000కి పెంచాలని, అర్హులకు నూతన పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.