ఆసియా కప్‌లో భాగంగా భారత్-పాక్ మ్యాచ్‌పై ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ద్వైపాక్షిక మ్యాచ్‌ల విషయంలో పాకిస్తాన్‌తో ఆడబోమని ప్రభుత్వం తమ వైఖరిని స్పష్టం చేసింది. అయితే ఏసీసీ లేదా ఐసీసీ టోర్నమెంట్లు ఉన్నప్పుడు మనం వాటిలో పాల్గొనాల్సి ఉంటుంది. అందుకే ప్రభుత్వం సలహా మేరకు నడుచుకుంటాం’ అని తెలిపారు.