NLR: ఎమ్మెల్యే అనే హోదాని ఆలయం బయటే వదిలిపెట్టి సామాన్య భక్తుడు లాగే తాను దేవస్థానంలోకి వస్తానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. నెల్లూరు దర్గామిట్టలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు దేవస్థానంలో 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరిగే 51వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు పై ఆయన సంబంధిత అధికారులతో శుక్రవారం సమీక్షించారు.