WGL: వరంగల్ నగరంలో నేరాల నియంత్రణ, నేరస్థులను గుర్తించే లక్ష్యంతో మట్టెవాడ పోలీసులు గురువారం అర్ధరాత్రి తమ పరిధిలోని వివిధ లాడ్జిలను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా లాడ్జిలో బస చేసిన వ్యక్తుల వివరాలను పోలీసులు సేకరించారు. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను పోలీసులు విచారించారు. ఈ రకమైన తనిఖీలు నేరాలను అరికట్టడానికి, ఉపయోగపడతాయని పోలీసులు తెలిపారు.