కృష్ణా: 1972లో కృష్ణారావు ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని ఏఎంసీ ఛైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం అవనిగడ్డలో ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు శత జయంతి సందర్భంగా కృష్ణారావు విగ్రహానికి ఏఎంసీ ఛైర్మన్ వెంకటేశ్వరరావు, వీరబాబు నివాళులర్పించారు. సాంఘీక సంక్షేమ, మత్స్య శాఖ మంత్రిగా కృష్ణారావు విశిష్ట సేవ చేశారన్నారు.