SRPT: సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈరోజు చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చాకలి ఐలమ్మ చేసిన పోరాటాన్ని కొనియాడారు. ఆమె ఆశయాలను నెరవేర్చాలని ఆయన అన్నారు.