Actor Shivaji కామెంట్స్..వాళ్లని నమ్ముకుంటే.. పవన్ సీఎం అవుతారు..
Actor Shivaji On Pawan Kalyan : హీరో శివాజీ.. పరిచయం అవసరం లేని పేరే. ఒకప్పుడు హీరోగా చేసిన ఆయన తర్వాత సినిమాలకు దూరమయ్యారు. కొంతకాలం రాజకీయాలకు సంబంధించిన వ్యాఖ్యలు చేస్తూ... హల్ చల్ చేసిన ఆయన కొంతకాలంగా వాటికి కూడా దూరమయ్యారు.
హీరో శివాజీ.. పరిచయం అవసరం లేని పేరే. ఒకప్పుడు హీరోగా చేసిన ఆయన తర్వాత సినిమాలకు దూరమయ్యారు. కొంతకాలం రాజకీయాలకు సంబంధించిన వ్యాఖ్యలు చేస్తూ… హల్ చల్ చేసిన ఆయన కొంతకాలంగా వాటికి కూడా దూరమయ్యారు. కాగా.. తాజాగా ఆయన మీడీయాతో మాట్లాడుతూ పవన్ ఫై సంచలన కామెంట్స్ చేశారు.
జగన్ లో ఉన్న ఫోకస్… పవన్ పై లేదని ఆయన అన్నారు. పవన్ ఇతర పార్టీలను నమ్ముకోవడం కంటే.. జనాలను నమ్ముకుంటే సులభంగా సీఎం అవుతారంటూ ఆయన పేర్కొనడం విశేషం. జనసేనకు ప్రజల్లో మంచి ఆదరణ ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. జనసేనకి ఉండాల్సిన ఓటు బేస్ ఉందని పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక శక్తి అని ప్రశంసించారు. పవన్ అనుకుంటే ఏదైనా జరిగిపోతుందని.. కానీ ఆయన అనుకోవడం లేదని శివాజీ పేర్కొన్నారు. ఆయన రోడ్డుపైకి వస్తే పార్టీలకు అతీతంగా వచ్చి ఆయనకి మద్దతు ఇచ్చేవాళ్లు చాలామంది ఉన్నారన్నారు. భగవంతుడు ఆయనకి ఆ ఆలోచన ఎప్పుడు ఇస్తాడా అని ఎదురుచూస్తున్నానని.. తనకు జనసేనలో పార్టీ చేరాలని ఆయనతో ఉండాలనేం లేదని పేర్కొన్నారు.