KRNL: రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యురాలు గంజిమల దేవి మంగళవారం పత్తికొండ, తుగ్గలి మండలాల్లోని రేషన్ దుకాణాలు, హాస్టళ్లు, గురుకుల పాఠశాల, సివిల్ సప్లై గోదాములను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంబేడ్కర్ గురుకులంలో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందుతుందా అని అడిగి తెలుసుకున్నారు. అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.