విశాఖలో మంగళవారం బీజేపీ కార్యకర్తలు ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ.. సరళీకృత జీఎస్టీ ఈనెల 22 నుంచి అమలవుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుతామని తెలిపారు. దీనివలన నిత్యావసరాలు, రైతాంగం, నిర్మాణ రంగానికి ఊరట లభిస్తుందని అన్నారు.