KDP: ఉల్లి రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం చేసిందని జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు సోమవారం యూరియా సరఫరా, ఉల్లి పంట కొనుగోలుపై CM, CSలతో VC సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఉల్లి కొనుగోలు కోసం కమలాపురం, మైదుకూరులలో కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అనంతరం ఈనెల 4 నుంచి ఉల్లిపంట కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైందన్నారు.