ADB: ఇచ్చొడ మండలంలో నూతనంగా ఎన్నుకోబడిన ఆటో యూనియన్ కార్యవర్గం సభ్యులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను నేరడిగొండ మండలంలోని ఆయన నివాసంలో సోమవారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన కార్యవర్గాన్ని ఎమ్మెల్యే శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆటో యూనియన్ నాయకుల సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు.