GNTR: ఇమామ్‌లకు రూ. 10 వేలు, మౌజన్లకు రూ.5 వేల గౌరవ వేతనం చెల్లించాలని వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరిఫాతిమా డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ వద్ద నిర్వహించిన గ్రీవెన్స్‌లో ఆమె జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. 11 నెలల నుంచి గౌరవ వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు మంజూరు చేయాలని కోరారు.