ELR: పేద బడుగు బలహీన వర్గాలకు అన్ని విధాల అండగా ఉండడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం అని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. సోమవారం పెదవేగి మండలం దుగ్గిరాల కార్యాలయంలో పలువురు బాధితులకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను బాధితులకు అందజేశారు. అలాగే వారి సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.