»The First Apple Offline Store In The India Mumbai Bkc Will Open On April 18
Apple offline store: దేశంలో మొదటి Apple ఆఫ్‌లైన్ స్టోర్ ఏప్రిల్ 18న షురూ
ప్రముఖ అమెరికన్ సంస్థ ఆపిల్ తొలిసారిగా ముంబయి(Mumbai), ఢిల్లీ(Delhi) ప్రాంతాల్లో వారి రిటైల్ ఆఫ్ లైన్ స్టోర్లను(Apple offline store) తెరిచేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 18న BKC స్టోర్ బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఒకటి, ఢిల్లీలోని సెలెక్ట్ సిటీవాక్ మాల్లో ఇంకొటి ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
ప్రముఖ సంస్థ ఆపిల్ ఇండియాలో తన మొదటి రిటైల్ ఆఫ్ లైన్ స్టోర్(Apple offline store)ను ఏప్రిల్ 18న ప్రారంభించబోతుంది. ఈ Apple స్టోర్ Mumbai BKC స్టోర్ బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ డ్రైవ్ మాల్ లోపల ఉంది. దీని తర్వాత స్టోర్ ఢిల్లీ(Delhi)లోని సెలెక్ట్ సిటీవాక్ మాల్లో (సాకేత్‌లో) ఉంటుందని సంస్థ వెల్లడించింది. దీనిని ఏప్రిల్ 20న ప్రారంభించనున్నట్లు తెలిపింది. ముంబయిలోని Apple BKC కేంద్రం ఏప్రిల్ 18న మంగళవారం ఉదయం 11AM ప్రారంభించనున్నట్లు చెప్పారు. దీంతోపాటు ఢిల్లీలో Apple Saket వినియోగదారుల కోసం ఏప్రిల్ 20న ఉదయం 10 గంటలకు తెరవబడుతుందని వెల్లడించారు.
ఆపిల్ కొత్త రిటైల్ స్టోర్లు ఇండియా(india)లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆపిల్ తమ ఫోన్లతోపాటు ఇతర ఉత్పత్తుల సేల్స్ కూడా పెరుగుతాయని భావిస్తోంది. దీంతోపాటు ఈ కేంద్రాలు వినియోగదారుల కోసం అసాధారణమైన సేవలను అందిస్తాయని వారు చెబుతున్నారు. ముంబైలోని స్టోర్ 22,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుందని తెలిసింది. ఇక ఢిల్లీలోని స్టోర్ 10,000 చదరపు అడుగులతో చాలా తక్కువగా ఉంది. ఈ లాంచ్ ఈవెంట్‌కు కంపెనీ సీఈవో టిమ్ కుక్ హాజరవుతారా లేదా అనే దానిపై యాపిల్ సంస్థ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
ఢిల్లీ, ముంబైలలో తన కొత్త స్టోర్లతో ఆపిల్ భారతదేశంలో కార్యకలాపాలను విస్తరించాలని భావిస్తోంది. ఇక్కడ గత ఆరు సంవత్సరాలుగా Apple దేశంలో స్థిరమైన వృద్ధిని సాధించింది. పరిశోధనా సంస్థ IDC ఫిబ్రవరి నివేదిక ప్రకారం ఆపిల్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్(smart phone) మార్కెట్లో (రూ. 41,000 అంతకంటే ఎక్కువ) ఆధిపత్యం చెలాయించింది. గత సంవత్సరం కూడా ఐఫోన్ 13 దేశంలో అత్యధికంగా అమ్ముడైన ఫోన్లలో ఒకటిగా నిలిచింది.