KRNL: జిల్లాలో గణేష్ నిమజ్జనం శాంతియుతంగా ముగియడానికి సహకరించిన ప్రజలు, మత పెద్దలు, రాజకీయ పార్టీలు, గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు, యువత, మీడియాకు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో తోడ్పాటుపై ఆశాభావం వ్యక్తం చేశారు.