SKLM: సరుబుజ్జిలి మండలంలో యారగాం గ్రామంలోని రూ .82 లక్షల NREGS నిధులతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, కాలువలును ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. కూటమి ప్రభుత్వంలోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్ ఎస్ సూర్యనారాయణతో పాటు నాయకులు తదితరులు పాల్గొన్నారు.