అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభానికి ప్రధాని మోదీ తెలంగాణకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో వచ్చిన ప్రధాని మోదీ బేంగపేట విమానాశ్రయంలో దిగారు. ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలుకగా.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, వైష్ణవ్ తదితరులు స్వాగతం పలికారు. కాగా ఈ పర్యటనకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉన్నారు. ఈ పర్యటన సందర్భంగా తెలంగాణ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు ప్రధాని చేరుకున్నారు. అక్కడ సికింద్రాబాద్- తిరుపతి మధ్య వందే భారత్ రైలును ప్రారంభించారు. అనంతరం అక్కడి నుంచి పరేడ్ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభ ప్రారంభానికి చేరుకుంటారు. ఈ బహిరంగ సభకు బీజేపీ భారీ ఏర్పాట్లు చేసింది. అయితే ఇది అధికారిక కార్యక్రమం కావడంతో సీఎం కేసీఆర్, స్థానిక మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి కూడా కుర్చీలు వేశారు.