SDPT: సిద్దిపేటలోని రేణుకానగర్ చౌరస్తాలో మతిస్థిమితం కోల్పోయిన ఓ యువతి హల్చల్ చేసింది. వివరాలు.. రేణుకానగర్లో నివాసం ఉంటున్న మతిస్థిమితం కోల్పోయిన ఓ యువతి(25) ఆదివారం మధ్యాహ్నం ఎదురుపడిన వాహనాలను, స్థానికంగా నిలిచి ఉన్న వాహనాలను పెద్దపెద్ద రాళ్లతో ధ్వంసం చేసింది. ఆ దారి గుండా వెళ్తున్న వాహనదారులపై దాడి చేయడంతో పలువురు గాయపడ్డారు.