SRD: దేశ సరిహద్దుల్లో సైనికులు ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నారని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా సంగారెడ్డిలోని ప్రభుత్వ అతిథి గృహంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. దేశ సైనికులే నిజమైన హీరోలని చెప్పారు. కార్గిల్ యుద్ధంలో మరణించిన సైనికుల కోసమే విజయ్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆమె పేర్కొన్నారు.