PDPL: భారీ వర్షాలతో గోదావరికి ఉపనది అయిన ప్రాణహిత నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజ్ ఠాకూర్ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. జిల్లాలోని వరద పరిస్థితిని కలెక్టర్, అదనపు కలెక్టర్ అరుణశ్రీతో ఫోన్లో సమీక్షించిన ఆయన, రెవెన్యూ, పోలీసు శాఖలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.