SRD: రామచంద్రాపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీలోని శ్రీ పోచమ్మ ఆలయ ప్రాంగణంలో నూతన నిర్మించిన కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఈ హాల్‌ను అతి త్వరలో ప్రారంభించనున్నారు. శనివారం ప్రారంభోత్సవ ఏర్పాట్లను స్థానిక కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నాగేష్ అధికారులతో కలిసి పరిశీలించారు.