JN: జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో శనివారం సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు చిట్యాల సోమన్న ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 28న జిల్లా కేంద్రంలోని సాయిరాం కన్వెన్షన్ హాల్లో JN మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ నరసింహారెడ్డి 34వ వర్ధంతి సభ జరగనుందని తెలిపారు. ప్రజలు, నాయకులు పెద్దఎత్తున పాల్గొని సభను జయప్రదం చేయాలని కోరారు.