మన్యం: అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలా కూటమి ప్రబుత్వ పాలన కొనసాగుతుందని ఎమ్మెల్యే తోయక జగదీశ్వరీ అన్నారు. శనివారం గరుగుబిల్లి మండలం కొంకడివరంలో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రజలను కలిసి ఏడాదిలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. రానున్న రోజులలో ప్రజలకు మరిన్ని సంక్షేమ ఫలాలను అందిస్తామన్నారు.