మెదక్: రేగోడ్-మర్పల్లి రహదారి మధ్యలో కల్వర్టు నిర్మించకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. 2 లేన్ల రహదారి సిద్ధంగా ఉన్నప్పటికీ, వాహనాలు ఎత్తైన రోడ్డు ఎక్కలేక తరచుగా బోల్తా పడుతున్నాయని ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ విషయంపై అధికారులు తక్షణమే స్పందించి కల్వర్టు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.