మేడ్చల్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో BJP ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా షాపూర్ నగర్, జీడిమెట్ల X రోడ్స్ నుంచి సూరారం కట్టమైసమ్మ ఆలయం వరకు 5K రన్ నిర్వహించారు. భారత సాయుధ దళాల అజేయ స్ఫూర్తిని గౌరవించేందుకు ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా BJP తెలంగాణ అధ్యక్షుడు రామచంద్ర రావు, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ S.మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.