RR: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డిపై కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాజేంద్ర నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, పార్టీ నేతలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కౌశిక్ రెడ్డిపై BNS 356(2), 353(B) 352 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు.