గుంటూరు జిల్లా సీతానగరం కరకట్ట వద్ద 2021లో జరిగిన సంచలనాత్మక సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు ప్రసన్న రెడ్డికి గుంటూరు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.57 వేల జరిమానా విధించింది. ప్రియుడి ముందే యువతిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుల్లో శేరు కృష్ణ ఇంకా పరారీలో ఉన్నాడు. తాడేపల్లి సీఐ దర్యాప్తు నిర్వహించగా, డీఎస్పీ ఛార్జిషీట్ దాఖలు చేశారు.