SRD: సంగారెడ్డిలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో సేవలందిస్తున్న డా. నాగ నిర్మలను జిల్లా ఇంఛార్జి వైద్యాధికారిణిగా నియమిస్తూ వైద్యారోగ్య శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఇంఛార్జి వైద్యాధికారిణి గాయత్రీ దేవిని జిల్లా డిప్యూటీ వైద్యాధికారిణిగా నియమిస్తూ కోహీర్ మండలానికి బదిలీ చేశారు.