MNCL: మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధి తుర్కపల్లి గ్రామంలో పాము కాటుకు గురై మహిళ మృతి చెందిన ఘటన గురువారం చోటు చేసుకుంది. ASI మాజీద్ వివరాల ప్రకారం మృతురాలు మంద శ్రీలత కాలకృత్యాల కోసం బయటకు వెళ్లగా, ఆమె కుడి కాలు మడమపై పాము కాటు వేసింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.