GNTR: పొన్నూరు పురపాలక సంఘంలో శుక్రవారం 21వ వార్డులో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ళ రమేష్ బాబు పరిశీలించారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో కాలువల్లో పూడికతీతలు, సిల్డ్ తొలగింపు కార్యక్రమాలను వేగవంతం చేయాలని సూచించారు. తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా సేకరించి కంపోస్ట్ యార్డ్‌కు తరలించాలని ఆదేశించారు.